JMS News Today

For Complete News

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

వెల్గటూర్, అక్టోబర్ 7: విద్యుత్ తీగలు యమపాశాలవుతున్నాయి. వరుస కరెంట్ షాక్ ప్రమాదాలు అందరిని కలవరపరుస్తున్నాయి. పెగడపల్లి మండలంలో ఇద్దరు కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా వెల్గటూర్ మండలం ఎండపల్లిలో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లిలో పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అజయ్ రెడ్డి , రాజిరెడ్డి అనే ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *