JMS News Today

For Complete News

వాటితో అరచేతిలో ప్రాణాలు..?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 17: విద్యుత్ అధికారుల నిర్లక్షం..ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. కిసాన్ నగర్ 5వ డివిజన్ పరిధిలోని బీజేేేఆర్ కాలనీలో బీజే 7 కరెంట్ పోల్ వంగిపోయింది. దీని ప్రక్కనే ఐపిడిఎస్ స్కీం ద్వారా పెద్ద పోల్ వేసినప్పటికీ, నెలలకు నెలలు గడిచిన ఇంతవరకు ఆ కరెంటు పోల్ కు కనెక్షన్ ఇవ్వలేదు. ఫలితంగా కరెంటు వైర్లు ప్రమాదకరంగా ఒక ఇంటి స్లాబ్ పైకి వేలాడపడితే, వాటికి సపోర్టుగా కట్టెలను బంగ్లా పైన పెట్టారు. దీంతో ఆ ఇంటి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. కరెంటు వైర్లు పూర్తిగా జోల పడి ఒకదానికొకటి అల్లు కొని ఉన్నాయి. దీంతో  రాత్రి సమయంలో బ్రేక్ డౌన్ అయి స్ట్రీట్ లైట్ లు వెలగడం లేదని, శివారు ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు వేయకపోతే విష పురుగులు కాటేసే ప్రమాదం ఉందని, దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా వెంటనే విద్యుత్  అధికారులు స్పందించాలని మాజీ కార్పోరేటర్ కంసాల శ్రీనివాస్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *