హైటెన్షన్ పోల్స్ తొలగింపు షురూ…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 12: కరీంనగర్ కోర్టు చౌరస్తాలో గల హై టెన్షన్ కరెంట్ పోల్స్ తొలగించే ప్రక్రియను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం విద్యానగర్ సురక్ష టవర్స్ వద్ద స్మార్ట్ సిటీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఇ మాధవరావు, మాజీ కార్పోరేటర్లు సునీల్ రావు, బండారి వేణు, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, అజిత్ రావు, బత్తుల భాగ్యలక్ష్మి, నాయకులు గందె మహేష్, తదితరులు పాల్గొన్నారు.