JMS News Today

For Complete News

ఎలక్ట్రానిక్ మీడియా అడహాక్ కమిటీ ఏర్పాటు…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఫిబ్రవరి 5: ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (టీయుడబ్ల్యూజే) అనుబంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అడహాక్ కమిటి ఏర్పాటైంది. శనివారం స్థానిక ప్రెస్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27న కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులచే సర్వసభ్య సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో కమిటీని ఎన్నుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కన్వీనర్ గా కొయ్యడ చంద్రశేఖర్ (రాజ్ న్యూస్), కో కన్వీనర్ గా ఊరడి రవీందర్ (ఐ న్యూస్), సభ్యులుగా జి సతీష్ (10 టీవీ), ఎస్. శ్రీనివాస్ (ఏబీఎన్ టీవీ), సంపత్ కుమార్ (టీవీ9) నియమితులయ్యారు. టీయూడబ్ల్యూజే ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యత్వ నమోదు కోసం కన్వీనర్, కో కన్వీనర్ తోపాటు సభ్యులను సంప్రదించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈద మధుకర్ రెడ్డి, టీయుడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి స్వామితో పాటు వివిధ ఎలక్ట్రానిక్ మీడియా చానళ్ళ ప్రతినిధులు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *