చత్తీస్గఢ్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు మావో ల హతం
1 min read
Weapons and military equipment for army, Assault rifle gun (M4A1) and pistol on camouflage background.
ఖమ్మం : చత్తీస్గఢ్ ఏజెన్సీలో తుపాకులు గర్జించాయి. డీఆర్జీ భద్రత బలగాలు, మావోల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య సుమారు ముప్పావు గంట పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి ఒక 301 బోర్ తుపాకి, ఒక 303 రైఫిల్ తో పాటు మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు.