అడవిలో తుపాకుల మోత..ఎస్ఐ సహా నలుగురు మవోల మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఛత్తీస్గడ్, మే 9: అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక ఎస్ఐ సహ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. తమకు తారసపడిన పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎస్సైతోపాటు నలుగురు మావోయిస్టులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా, ఘటన స్థలంలో లభించిన ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.