బిజెపి లో మరో విషాదం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 24: బిజెపిలో మరో విషాదం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణం నుంచి తేరుకోకముందే మరో అగ్ర నేత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ కన్ను మూశారు. వరుస అగ్ర నేతల అకాల మరణాలు ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న జైట్లీ కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. జెట్లీ మృతి పట్ల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, బిజెపి అగ్ర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు విచారం వ్యక్తం చేశారు.