ఆ ప్రాజెక్టు వాళ్ళ కోసమే….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 8: ప్రాజెక్టు ల పేరుమీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేసిందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. గురువారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి ఒక్క చుక్క కూడా నీరందించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం ఉండాలేకానీ, కాంట్రాక్టర్ల కోసమే అన్నట్టుగా ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతం అవుతుందని, 2024లో బిజెపిదేే ప్రభుత్వమని దత్తాత్రేయ అన్నారు. అనంతరం నగరంలోని 43వ డివిజన్ లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం రశీదులను అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ, బిజెపి నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, నాయకులు కొరటాల శివరామకృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మార్షల్, దుబాల శ్రీనివాస్, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, సంజిత్ సింగ్, సుజాత రెడ్డి, గాజుల స్వప్న, బండ అనిత, హరికుమార్ గౌడ్, కచ్చు రవి, కటకం లోకేష్, నాంపల్లి శ్రీనివాస్, పొన్నం మొండయ్య గౌడ్, నాగసముద్రం ప్రవీణ్, సాయి, రమేష్, తిరుపతి, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.