కాషాయ కండువ కప్పుకున్న కటుకం…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
సిరిసిల్ల, జూన్ 5: మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం ఎట్టకేలకు కాషాయ కండువ కప్పుకున్నారు. ఇవాళ గంభీరావుపేట మండల కేంద్రంలో కటుకం మృత్యుంజయం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మృత్యుంజయం చేరగా, సంజయ్ బీజేపీ కండువా కప్పి మృత్యుంజయం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేతలు వివేక్ వెంకట స్వామి, ఇనుగాల పెద్దిరెడ్డి, బొడిగె శోభ, సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.