పొలిటికల్ గా సాగర్ జీ రీ ఎంట్రీ…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 16: మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పొలిటికల్ గా రీఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యత్వాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో హైదరాబాద్ లో స్వీకరించారు. సాగర్ జీకి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన రాకపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పార్టీ సభ్యత్వానికి సాగర్ జీ రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, సాగర్ జీని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న విద్యాసాగర్ రావు నాయకత్వం ద్వారా తెలంగాణలో పార్టీ ఉన్నత శిఖరాలకు ఎదిగి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అధికారంలోకి వస్తుందని ఎంపీ బండి సంజయ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యాసాగర్‌రావు నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమం బలోపేతం అయ్యిందని, గోదావరి జలాల ఉద్యమం నిర్వహించడం విద్యాసాగరరావు నాయకత్వ లక్షణ పటిమను నిదర్శనమని వివరించారు. సాగర్ జీ కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటకం లోకేష్, నేరెళ్ల శ్రీనివాస్, మహేష్, నాగరాజు తదితరులు ఉన్నారు.