JMS News Today

For Complete News

సీఎం కేసిఆర్ కు అన్ని వివరించా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సందర్బంలో అన్ని విషయాలను కూలకషంగా ముఖ్యమంత్రికి వివరించానని, ముఖ్యంగా ఉద్యమకారుల గురించి, వారి ప్రస్తుత పరిస్థితులను పూర్తి స్థాయిలో వివరించినట్లు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత తొలిసారిగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించి, స్మార్ట్ సీటీ పనుల్లో జరుగుతున్న పనుల గురించి కూడా స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలతో
అన్ని పార్టీల నేతలు, ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపిన రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ కలిసి పనిచేద్దామని సూచించిన మేరకు తెరాసలో ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.