JMS News Today

For Complete News

మార్కుల కోసం మాట్లాడకు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జమ్మికుంట, ఆగస్టు 12: మంత్రి హరీష్ రావు మనది 18 సంవత్సరాల అనుబంధం. అవన్నీ మర్చిపోయి మీ మామ దగ్గర మార్కులు కొట్టడానికి ఇవన్నీ చేయకు, ఎదిపడితే అది మాట్లాడకు. నీవు ఎంతచేసిన మీ మామ నిన్ను నమ్మడు అంటూ మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఏనాటికైనా టిఆర్ఎస్ పార్టీని కాప్చర్ చేస్తా అనుకుంటున్నావు. కాని మీ మామ బతికుండగానే టిఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, మిమ్ముల్ని ఎవరూ నమ్మరని, మీ చేతికి వచ్చేలోపు పార్టీ ఖతమయితదని జోస్యం చెప్పారు. ఇవాళ జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే చరిత్ర మిమ్ముల్ని క్షమించదని తెలిపారు. చిల్లర ఆరోపణలు, చౌక బారు ప్రచారాలు చేయవద్దని, ఇలా చేసి పలచపడకు అంటూ హరీష్ రావుకు హితవు పలికారు. ధర్మానికి, న్యాయానికి విరుద్దంగా పనిచేస్తే మీకు కూడా అదే గతి పడుతుందని, మీ మోసపు మాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరని, దుబ్బాకలో లాగా కర్రూ కాల్చి వాత పెడతారని చెప్పారు. ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిన వాడివి నువ్వు, మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నావని, కాని నేను ఒక్క అవకాశం ఇస్తే ఓటమి లేకుండా ప్రజల ప్రేమను పొందిన వాడినని అన్నారు. హుజూరాబాద్ లో అభివృద్ది జరగలేదని అంటున్నారని, మీరు నిన్న తిరిగిన అన్నీ రోడ్లు నాలుగు లైన్ల రోడ్లు వేయించింది నేనే, అభివృద్ది విషయంలో మీకు ఎంత సోయి ఉందో నాకు అంతే సోయి ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చినానని, ఇది ప్రజలకు తెలుసని అన్నారు. ఎస్సీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు, వెలమలకు ఎన్ని పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. నా పదవి కంటే నా ఆత్మ గౌరవం గొప్పదని, వందల కోట్లతో ప్రజలను కొనడానికి పునాది వేసిన వాడిగా కెసిఆర్ మీ పేరు చరిత్రలో నిలిచి పోతుందని దుయ్యబట్టారు. డబ్బులు ఖజానాలో నిండుగా ఉంటే జీతాలు 20వ తేదీ వరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తనపై చేసిన వ్యాఖ్యలపై అబిడ్స్ చౌరస్తాలో చర్చకు సిద్దమా అంటూ ఈటెల రాజేందర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *