JMS News Today

For Complete News

ఆ మంత్రులకు అదే పని..వేరే లేదు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

వీణవంక, అక్టోబర్ 24: ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వాల్సిన ఆర్థిక మంత్రి ఇక్కడ డబ్బులు పంచుతున్నారని, తడిసిన ధాన్యం కొనాల్సిన పౌరసరఫరాల మంత్రి మందు పంచుతున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రజల ఆరోగ్యం మీద, రైతుల వడ్ల మీద శ్రద్ద లేదని, కేవలం రాజేందర్ ను ఓడించడమే వారి పని అని దుయ్యబట్టారు. ఆదివారం వీణవంక మండలం కానిపర్తి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ ప్రసంగించారు. వెన్నుపోటు పొడిచింది నేనా? కేసీఆరా ? అని అడిగితే కెసిఆరే అని ప్రజలంతా చెప్పారని తెలిపారు. 30 ఏప్రిల్ చిల్లర ఆరోపణ చేసి, మే 2 న మెడలు పట్టి బయటికి పంపించారని, కరోనా లాంటి గంభీరమైన సమయంలో మంత్రి పదవి తీసివేయడం బాధ అనిపించిందే తప్ప, మంత్రి పదవి పోయినందుకు కాదని అన్నారు. రాజీనామా చేస్తావా లేదా అని డిమాండ్ చేస్తే వారి మొఖాన కొట్టి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల మండల ఇంఛార్జి గోదావరిఖని కి చెందిన కౌశిక్ హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *