మాజీ మంత్రి చెరుకు ఇక లేరు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 2: సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాలలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, ముత్యంరెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కెసిఆర్ కు ముత్యంరెడ్డికి మొదటినుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీలో వీరిద్దరు కలిసి పనిచేశారు. ప్రస్తుతం ముత్యం రెడ్డి టీఆర్ఎస్ లో ఉన్నారు.