JMS News Today

For Complete News

ఆ వీర వనిత ఇకలేరు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, మార్చి 19: అలుపెరగని యోధురాలైన ఆ వీర వనిత ఇకలేరు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (92) కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1931లో కొత్తగూడెంలో జన్మించిన మల్లు స్వరాజ్యం వామపక్ష దిగ్గజం భీంరెడ్డి నర్సింహారెడ్డికి స్వయానా సోదరి. మల్లు వెంకట నర్సింహారెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. చరిత్రకెక్కిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం రజాకార్ల పాలిట సింహస్వప్నంలా నిలిచారు. నా మాటే తుపాకీ తూటా పేరిట ఆత్మకథ కూడా రాశారు. రాజకీయాల్లో ప్రవేశించిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.13 ఏళ్ల వయసులోనే సాయుధ పోరాటంలో పాల్గొనడం, అందులో తుపాకీ చేతబూనిన తొలి మహిళ కూడా ఆమె. కాగా, మల్లు స్వరాజ్యం మృతి పట్ల సిఎం కేసీఆర్, వామపక్ష నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, నారాయణ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం నల్గొండలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *