వారికీ అదేగతి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 1: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ ఆరోపించారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిన్న కొమురం భీం జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్ అనిత పై దాడే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులంతా ఒక్క తాటిపైకి రావాలని సూచించారు. మహిళా ఉద్యోగస్తులంతా, మహిళా ప్రజాప్రతినిధులు అది ఏ పార్టీలో ఉన్నా కూడా దీన్ని ఖండించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, నిన్నటి ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే, తన సోదరుడు కృష్ణ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, వాళ్ళ తమ్ముడు జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ పైన క్రిమినల్ కేసులు పెట్టి రిమాండ్ కు పంపించాాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో 62 మంది చనిపోతే రాని ముఖ్యమంత్రి సినీ ప్రముఖులు చనిపోతే పరామర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఈటల రాజేందర్ ఆస్పత్రికి వెళ్లి ఫారెస్ట్ అధికారి అనితను పరామర్శించాలని అన్నారు. భూ ప్రక్షాళన ప్రజలకు జరిగిందా ? మీ కుటుంబానికి జరిగిందా ? అంటూ ప్రశ్నించారు. అటవీ అధికారులపై దాడి చేస్తున్న సందర్భంగా చోద్యం చూసిన పోలీస్ అధికారుల అందర్నీ ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో నిజామాబాదు లో కవితకు, కరీంనగర్ లో వినోద్ కుమార్ కు పట్టిన గతే కెసిఆర్, కేటీఆర్ కు పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ, నేేేేతలు మహేందర్, మురళీ తదితరులు పాల్గొన్నారు.