ప్రణబ్ ఇక లేరు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
డిల్లీ, ఆగస్టు 31: మాజీ రాష్ట్రపతి, రాజకీయ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ (84) కొద్ది సేపటికి క్రితం కన్ను మూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 10న ఢిల్లీ లోని ఆర్మీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ కొద్ది సేపటికి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో 13వ రాష్ట్రపతిగా దేేశానికి సేవలందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలందించారు. 1935 డిసెంబర్ 11న ప్రణబ్ జన్మించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.