తెల్లవారితే..!?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 19: కిక్కు లక్కు ఎవరిని వరించనుందో తెల్లవారితే తేలిపోనుంది. పోటాపోటీగా వచ్చిన ధరఖాస్తులను మరికొన్ని గంటల్లో లాటరీ పద్దతిన అధికారులు కేటాయించనున్నారు. కేటాయించిన మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సు ద్వారా వ్యాపారం షురూ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో 94, జగిత్యాలలో 71, పెద్దపల్లిలో 77, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాలు కేటాయించగా, వీటన్నింటికి కలిపి సుమారు నాలుగువేలకుపైగా ధరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 94 మద్యం దుకాణాలను కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్దతిన కేటాయించడం జరుగుతుందని జిల్లా అబ్కారి అధికారి కె. చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, డ్రాకి వచ్చే ధరఖాస్తుదారులు ఖచ్చితంగా ఎంట్రీ పాస్ తమ వెంట తెచ్చుకోవాలని అయన సూచించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఏర్పాట్లను పరిశీలించి అబ్కారి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ చంద్రమోహన్, ఎస్సై చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి అబ్కారీ అధికారులు అంతా సిద్దం చేయగా, కిక్కు లక్కు ఎవరిని వరించనుందో వేచిచూడాల్సిందే మరీ.