JMS News Today

For Complete News

ఫర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 27: కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కరీంనగర్ మార్కెట్ రోడ్ లోని పర్టిలైజర్స్, సీడ్స్ విక్రయ షాపులపై మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వరుణ్, జయ కార్తిక్, రెడ్డి ఏజన్సీ దుకాణాలలో నిషేధిత, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న గడ్డి మందులు, రసాయనాలు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు ఒక లక్ష యాబై వేల రూపాయల పైచిలుకు ఉంటుంది. ఈ తనిఖీల్లో వ్యవసాయ అధికారులు హరిత, సత్యం, టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *