JMS News Today

For Complete News

తోటి ఉద్యోగికి ఆర్థిక సాయం….

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 8: ఆల్కమ్ (పౌల్ట్రీ, వెటర్నరీ) కంపెనీకి ఉద్యోగి సంపత్ ప్రమాదవశాత్తు కాలు ఫ్రాక్చర్ కావడంతో పౌల్ట్రీ మరియు వెటర్నరీ అసోసియేషన్ సంపత్ కు బాసటగా నిలిచింది. పౌల్ట్రీ అండ్ వెటర్నరీ అసోసియేషన్ సభ్యులు అందరు కలిసి ఒక లక్ష రూపాయలు సేకరించారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సంపత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, సభ్యులు సత్యం, అన్వేష్, డీ.సతీష్, వినోద్, నాగరాజు, సతీష్ తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.