ఆ పోలీసులు ఎం చేశారంటే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 17: కరోనాతో మృతి చెందిన ఓ మృతుడి కుటుంబానికి కరీంనగర్ పిటిసి అధికారులు ఆర్థిక చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ లోని రాంనగర్ లో గల పోలీసు శిక్షణ కళాశాల (పిటిసి)కి చెందిన అన్ని స్థాయిల పోలీసు అధికారులు, సిబ్బంది ఇటీవల కరోనాతో మృతి చెందిన కాంట్రాక్ట్ దోబి నడిగొట్టు రాజేశం (53) కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రిన్సిపాల్ వి. సునీత మోహన్ 50 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని మృతుడి భార్య విజయకు అధికారులు, సిబ్బంది సమక్షంలో అందజేశారు. పిటిసిలో 2017 నుండి పిటిసిలో రాజేశం కాంట్రాక్ట్ పద్దతిలో దోభి వృత్తిని నిర్వహిస్తూ, కరోనా మహమ్మారితో ఇటీవల మృతి చెందాడు. అతడి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలువాలనే ఉద్దేశంతో ఈ ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవి, డిఎస్పి గంగాధర్ తో పాటు పలువురు పిటిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.