అక్కడ ఘోర దుర్ఘటన జరిగింది…
1 min read
ఇండోనేషియా: ఇండోనేషియా లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్గిపుల్లల తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘోర దుర్ఘటన విషాదాన్ని నింపింది. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని బింజాయ్ నగరంలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగానే ఉందని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఒకేసారి అన్ని వైపుల నుంచి చుట్టు ముట్టడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.