జగిత్యాల లో అగ్ని ప్రమాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూన్ 23: జగిత్యాల జిల్లా
కేంద్రంలోని టవర్ సర్కిల్ సమీపంలోని శివ వీధిలో ఉన్న తుక్కు (స్క్రాపు) షాపులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింంది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షాపు, ఇల్లు కూడా అదే కావడంతో కుటుంబ సభ్యులు సురక్షితంగా బయట పడ్డారు. సమయానికి ఫైరింజన్ చేరుకోకపోవడంతో స్థానికులు మంటలు ఆర్పివేసారు. అనంతరంం చేేేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మిగిలిన మంటలు ఆరిపివేేేసారు.