JMS News Today

For Complete News

మహిళా జర్నలిస్టు పై కాల్పులు…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఢిల్లీ, జూన్ 23: తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఓ సీనియర్ మహిళా జర్నలిస్టు పై జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించాయి. ఈ ఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ చందోలాపై…గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ ఆమె ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *