పైలట్ అప్రమత్తత..అందరూ సేఫ్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ముంబై, ఆగస్టు 30: పైలట్ అప్రమత్తత… ప్రయాణీకులంతా క్షేమం..పైలట్ అప్రమత్తతో హైదరాబాద్కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.120మంది ప్రయాణికులతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన అరగంటకే విమానంలో స్వల్ప సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో సినీ నటుడు చిరంజీవి ప్రయాణిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘సైరా’ సినిమా ప్రమోషన్ కోసం ఆయన ముంబై వెళ్లారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. విస్తారా ఫ్లైట్ (యూకే869)లో ఈ సమస్య తలెత్తిందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేశామని ఆ విమాన సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.