విద్యార్థుల అస్వస్థత…ఆసుపత్రికి తరలింపు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 25: భోజనం తిన్న తరువాత విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నం మోడల్ హాస్టల్ లో మంగళవారం చోటుచేసుకుంది. అస్వస్థత కు గురైన సుమారు 22 మంది విద్యార్థులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.