JMS News Today

For Complete News

అటవీ అధికారులపై దాడి….

1 min read

బ్రేకింగ్ న్యూస్…

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కొమురంభీం, జూన్ 30: అటవీ శాఖ అధికారులపై గ్రామస్తులు కర్రలతో దాడి చేసిన ఘటన కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాలలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ప్లాంటేషన్ కోసం భూమిని చదును చేస్తుండగా…ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ, అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక దశలో ఎఫ్ఆర్ఓ అనితపై గ్రామస్తులు కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ అనితకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే పలువురు అటవీశాఖ అధికారులు కూడా దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే తమ్ముడు తనపై దాడి చేశాడని అనిత ఆరోపిస్తున్నారు. మహిళా అనిచూడకుండా తనపై దాడి చేశారని బాధితురాలు రోధిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *