దాడుల పరంపర…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
భద్రాద్రి, జూలై 2: అటవీ అధికారులపై దాడుల పరంపర కొనసాగుతోంది. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ జరిపిన అటవీ అధికారులపై దాడి ఘటన మరువక ముందే భద్రాద్రిలో మరో ఘటన జరిగింది. ములకలపల్లి మండలం గుండాలపాడులో పోడు భూముల్లో సాగు చేయడాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి జరిపారు.
ఈ దాడిలో బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్యతో పాటు అటవీశాఖ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పాల్వంచలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీంతో గుండాలపాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.