JMS News Today

For Complete News

వారికి వారిపైనే ప్రేమ….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 20: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ సర్కార్ కు వ్యాపారవేత్తల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని, అందుకే రైతుల నడ్డి విరిచే బిల్లును తెచ్చారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ రైతులను దెబ్బ తీసి వ్యాపార వేత్తలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్  సూచనలతో పార్లమెంట్ లో తెలంగాణ ఎంపిలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఈ వ్యవసాయ బిల్లులో అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పైకి చెప్పడానికి రైతులు తమ పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో పొందుపరచిన వాస్తవానికి అది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, దళారులకు లాభం చేకురుస్తుందని తెలిపారు. రైతులకన్నా వ్యాపార సంస్థలకు, దళారీ వ్యవస్థలకే లబ్ధి చేయడానికి ఉపయోగపడే బిల్లులా ఉందని విమర్శించారు. లాక్ డౌన్ లో కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు మొత్తం ధాన్యం గ్రామాల్లోనే ఎక్కడికక్కడే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. యావత్ దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అందుకోవడంలో ఆదర్శంగా నిలిచారని సింగ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *