యూరియా ఏదీ…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, సెప్టెంబర్ 4: యూరియా కోసం జగిత్యాల జిల్లాలో నిత్యం ఎదో ఒక చోట రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా…అధికారులు పట్టించుకోవడం లేదని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటలను కాపాడుకునేందుకు వెంటనే సరిపడా యూరియా తెప్పించి కొరత నివారించాలని కోరుతూ బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొరత కారణంగా పంటలు నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరారు. ప్రతి రోజు ఎదో ఒక చోట రైతులు యూరియా కోసం రోడ్డెక్కుతున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎస్ఆర్ఎస్పీ నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నదని, తద్వారా తమ పంటలకు నీరు రావడం లేదని, వెంటనే నీటి తరలింపు ఆపేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతుల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.