JMS News Today

For Complete News

బండెనక బండి పెట్టి….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 23: సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో రాష్ర వ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ కు మద్దతుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతులు ఎడ్లబండ్లు,300 వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ రేకుర్తి సాలే నగర్ ఈద్గా నుండి ప్రారంభమై కోర్టు మీదుగా, తెలంగాణ చౌక్, బస్టాండ్, కమాన్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ళు, డిజె పాటలతో జయహో కేసీఆర్ అంటూ తమ సంఘీభావం తెలుపుతు రోడ్డు పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తరతరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు ఇక పరిష్కారం లభించినట్లేనని సంతోషం వ్యక్తం చేశారు. మీ వెంటే మేమంటూ కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన రెవిన్యూ చట్టానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కొత్తపల్లి, కరీంనగర్ ఎంపీపీ లు పిల్లి శ్రీలత -మహేష్ , తిప్పర్తి లక్ష్మయ్య , సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు మంద రాజమల్లు, పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి , బల్మురి ఆనంద రావు , కసార్ల శ్రీనివాస్ , సుంకిశాల సంపత్ రావు , పిట్టల రవీందర్ , జువ్వాడి రాజేశ్వర్ రావు పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *