JMS News Today

For Complete News

ఎమ్మెల్యే గంగుల ఏమన్నారంటే…..

1 min read

కరీంనగర్: నగర పాలక సంస్థ 32 వ డివిజన్ సప్తగిరి కాలనీ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు లు శంకుస్థాపన చేశారు. మంగళవారం సప్తగిరికాలనీ లో ముఖ్యమంత్రి హామీ నిధులు రూ. 2 కోట్ల తో నిర్మించే సిసి రోడ్లు , మురికి కాల్వ నిర్మాణ పనులను వారు ప్రారంభించారు.. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సప్తగిరి కాలనీ, జానకి కాలనీ ఆవిర్భవించి సుమారు 15 సంవత్సరాలు కావస్తున్నా.. ఈ కాలనీలో అభివృద్ధి పనులు అంతంత మాత్రమే ఉన్నాయని అన్నారు.. మూడో సారి ఎన్నికల్లో గెలవడం తో తన పై మరింత బరువు బాధ్యతలు పెరిగాయని అన్నారు ..కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మున్సిపాలిటీ లన్ని ప్రజలు కట్టే పన్నుల మీదనే ఆధారపడి ఉండేవని పునరుద్ఘాటించారు..కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఏవి రమణ, దిండిగాల మహేష్ , శ్రీనివాస్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , పంచాయతీ రాజ్ ఏఈ ప్రవీణ్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *