JMS News Today

For Complete News

ఆ ఊరిలో విషాదచ్చాయలు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

మంచిర్యాల, మార్చి 25: అప్పులు ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విధారక ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. మల్కపల్లికి చెందిన రమేశ్, పద్మ దంపతులతోపాటు వారి కూతురు సౌమ్య, కుమారుడు అక్షయ్ లు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేర స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *