JMS News Today

For Complete News

ప్రీడమ్ పైటర్స్ తో ఇంటరాక్షన్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 10: భారత తపాల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ శాఖ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది నిత్యం వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అటు ఆఫీసు కార్యక్రమాలను చూసుకుంటూనే ఇటు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలలో నిమగ్నమవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నివసించే స్వాతంత్య్ర సమరయోధుల ఇళ్ళకు అధికారులు వెళ్ళి జాతీయ జెండాలను అందించారు. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ మురళీ మనోహర్ (80), బూర్ల కాంతయ్య (85), నందికొండ రాజారెడ్డి (85), ఒంటెల ధర్మారెడ్డి (87)లను పోస్టల్ అధికారులు కలిసి జాతీయ జెండాలను అందించారు. ఈ సందర్భంగా వారితో కొద్ది సేపు పోస్టల్ అధికారులు ముచ్చటించారు. స్వాతంత్ర్య సమరయోధులు తమ స్వాతంత్ర్య ఉద్యమ విషయాలు, అనుభవాలను వివరించడంతోపాటు పోస్టల్ శాఖతో ఉన్న అనుబంధం, అందిస్తున్న సేవలపై ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ వై. వెంకటేశ్వర్లు, ఎఎస్పీ సునీల్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ఉప్పుల రామేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.