పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు
1 min read
హైదరాబాద్: తెలంగాణ రాకముందు కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఏపితో కూడ నిత్యం వివాదాలు ఉండేవని. అలాంటీ పరిస్థితుల నుండి ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని సీఎం కేసీఆర్ వెళ్లడించారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు సైతం పూర్తి కావస్తున్నాయని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంతో మూడు సార్లు నీళ్లను ఇచ్చిపుచ్చుకున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మహారాష్ట్ర పూర్తిగా సహాకారం అందిస్తోందని అన్నారు. నాలుగు నెలల తర్వాత మంగళవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు. క్యాబినెట్ భేటికి సంబంధిన విషయాలను సీఎం కేసీఆర్ స్వయంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార 45 లక్షల ఎకరాలకు నీరందించంతోపాటు పారీశ్రామిక అవసరాలకు కూడ నీటీ అవసరాన్ని తీర్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రానున్నారని అన్నారు. క్రిష్ణ, గోదావరిలో ఉభయ రాష్ట్రలకు అందుబాటులో ఉన్న నికర, వరద జలాలు సుమారు 5000 టీఎంసీల నీళ్లను రెండు రాష్ట్రాలలోనూ ప్రతి అంగుళం భూమికి తీసుకుపోవాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో వీటిని అమలు చేసి రుణమాఫి అమలుకు అమోదం తెలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆసరా పించన్లు పెంపుకు ఆమోద్ర వేసింది.మరోవైపు పంచాయితీ రాజ్ నూతన చట్టంతోపాటు కోత్త పురపాలక చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులరు పీఆర్సీతోపాటు పదవి విరమణ వయస్సును కూడ పెంచుతామని సీఎం ప్రకటించారు. అయితే పీఆర్సీ ఎంత శాతం ఇవ్వాలనే దానిపై ఉద్యొగ సంఘాలతో సమావేశమై చర్చిస్తామని అన్నారు.