ఆ ఎమ్మెల్యే ఉదారతకు…హాట్సాఫ్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 28: కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాల నిర్వాహకులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుభవార్త తెలిపారు. అన్ని వినాయక మండపాలకు సంబంధించిన విద్యుత్ ఛార్జీలను తానే స్వయంగా చెల్లించారు. ఈ మేరకు ట్రాన్స్ కో ఎస్ఈకి రెండున్నర లక్షల రూపాయల చెక్కును అడ్వాన్స్ గా అందించారు. విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు కరీంనగర్ ప్రజలు సిద్ధం అవుతున్నారు.. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 800 మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముందుకు వచ్చారు. అన్ని మండపాలకు సరిపడే ఛార్జీలను ఆయన చెల్లిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా తన వేతనం నుంచి రెండున్నర లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ట్రాన్స్ కో ఎస్ఈ మాధవ రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, లైబ్రరీ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గంగుల కమాలాకర్ అన్నారు. తన వేతనాన్ని దైవ కార్యం కోసం కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. మండపాల వద్ద సురక్షితమైన విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలను చెల్లిస్తున్నానని ఈ ఏడు కూడా తానే అందిస్తానని చెప్పారు. ఇది అడ్వాన్స్ మాత్రమేనని విద్యుత్ శాఖాధికారులు బిల్లు లెక్కించి ఎంత డిమాండ్ ఇస్తే అది కూడా చెల్లిస్తానని ప్రకటించారు. అర్బన్, రూరల్ ప్రాంతంలోని అన్ని మండపాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. మండపాల ఏర్పాటు కోసం రోడ్లను ధ్వంసం చేయవద్దని, రోడ్లను కన్నతల్లిగా చూసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎమ్మెల్యే ఉదారతకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.