గంగుల ప్రభాకర్ కు ఘన నివాళి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 11: గంగుల వంశంలో చోటుచేసుకున్న విషాదం నుంచి…గంగుల కుటుంబీకులు ఇంకా కోలుకోలేదు. గంగుల ప్రభాకర్ అకాల మరణం చెంది..నేటికి ఏడాది పూర్తైంది. శోక సంద్రంలో మునిగిపోయిన గంగుల వంశస్థులు…బాధా తప్త హృదయాలతో గంగుల ప్రభాకర్ కు నివాళులు అర్పించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై…శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ ఏడాది మాసికాన్ని ఆదివారం నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాళ్లో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వేలాది మంది హాజరై…గంగుల ప్రభాకర్ కు నివాళులు అర్పించారు. తొలుత గంగుల సోదరులు గంగుల వెంకన్న, సుధాకర్, కమలాకర్…తమ సోదరుడి చిత్రపటం వద్ద పుష్పాలతో అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు గంగుల ప్రభాకర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్, పుట్ట మధు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, సుడా ఛైర్మన్ జీవీ రామక్రిష్ణా రావు, జడ్పీ ఛైర్ పర్సన్ విజయ, టీఆర్ఎస్ నాయకులు కర్ర శ్రీహరి, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీఆర్ఎస్ నాయకులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, పోలీసు అధికారులు, కరీంనగర్ పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభాకర్ కు అంజలి ఘటించారు.