JMS News Today

For Complete News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 22: గాయత్రి బ్యాంకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు అన్నారు. ది గాయత్రి కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కరీంనగర్ శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో , ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి బ్యాంకు ఖాతాదారుడు ఎండి ఖాజా అలీముద్దీన్ భార్య సెహనాజ్ బేగంకు ప్రమాద బీమా సౌకర్యం ద్వారా వచ్చిన ఒక లక్ష రూపాయల చెక్కును మేయర్ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కోవిడ్ -19 వైరస్ వ్యాపిస్తున్న సమయంలో కూడా మాస్కులు , సానిటైజర్స్ వినియోగిస్తూ సోషల్ డిస్టెన్ను పాటిస్తూ , వినియోగదారులకు నమ్మకమైన బ్యాంకింగ్ సేవలందిస్తూ, వారి ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తున్న గాయత్రి బ్యాంకు సేవలను అభినందించారు. ఖాతాదారులకు కనీస డిపాజిట్ తోనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పేద, మధ్య తరగతి వినియోగదారులకు ప్రమాద భీమా కల్పిస్తూ వారికి అండగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 24 గంటలు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా కరీంనగర్, పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీరుస్తుందని మేయర్ అన్నారు. బ్రాంచి మేనేజర్ ఎస్.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ బ్యాంకు వినియోగదారులకు కేవలం 12 శాతం  సాలుసరి వడ్డీకే బంగారు ఆభరణాలపై గ్రాముకు అత్యధికంగా రూ. 2800లతో ఋణాలను అందిస్తున్నామని, సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో, జిరాక్ ను బ్యాంకులోనే ఉచితంగా అందిస్తున్నామని, వినియోగదారులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *