ట్రాఫిక్ చలాను చెల్లించిన జీహెచ్ఎంసీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే. కామ్)
హైదరాబాద్, జూన్ 27: జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఉపయోగించే కారు నెం. (టిఎస్ 09 ఎఫ్ఏ 4248) పై అతివేగంగా ప్రయాణించినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధించిన ఆరు జరిమానాల మొత్తం రూ. 6,210లను గురువారం జీహెచ్ఎంసీ చెల్లించింది. అయితే, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వాహనాన్ని నడిపినందుకుగాను డ్రైవర్లను కమిషనర్ దానకిషోర్ తీవ్రంగా మందలించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు.