JMS News Today

For Complete News

విషాదంలో ఆ కుటుంబం….

1 min read

జగిత్యాల:  గంపెడాశతో గల్ఫ్ బాట పట్టిన ఓ యువకుడిని విధి పగబట్టింది. ప్రమాద రూపంలో మృత్యుఒడిలోకి చేర్చింది. ఈ ఘటన ఆ యువకుడి కుటుంబంలో తీరని విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే….జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాగర మహేందర్ అనే యువకుడు గత 11 నెలల క్రితం ఉపాధి నిమిత్తం ( దుబాయ్) వెళ్ళాడు. అక్కడ నేషనల్ అబుదాబి హోటల్ లో క్లినింగ్ పని చేసుకుంటూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే, మహేందర్ కు సెలవు దినం కావడంతో మిత్రుల వద్దకు వెళ్లగా,అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఊహించని రీతిలో ప్రమాదవశాత్తు పడి,15 రోజుల క్రితం మృతి చెందాడు. మృత్యు వార్త విన్న ఆ కుటుంబం శోఖ సంద్రంలో మునిగిపోయింది. 15 రోజుల నిరీక్షణ అనంతరం బుధవారం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిన మృతదేహాన్ని ఓ అంబులెన్స్ లో జగిత్యాలకు తీసుకువచ్చారు. అయితే, మృతుడు మహేందర్ ఉండే ఇల్లు అద్దె ఇల్లు కావడంతో మృతదేహాన్ని నేరుగా ఎయిర్ పోర్టు నుండి నేరుగా జగిత్యాలలోని శంకర్ ఘాట్ స్మశానానికి తరలించారు. కుటుంబ సభ్యులు సైతం మృతదేహం కొరకు స్మశానం లోనే నిరీక్షించారు. స్మశానా నికి అంబులెన్స్ చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  పెరిగి పెద్దయిన కొడుకు ఇంటి భారం మొస్తడనుకుంటే, విగత జీవిగా తిరిగి రావడం ఆ కుటుంబాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టింది. విగత జీవిగా వచ్చిన తన బిడ్డను చూసి తల్లి తండ్రులు , తమతో చదివి, తమ వెంట ఉండి కలిసి తిరిగిన మిత్రుడు కానరాని లోకాలకు వెళ్ళడని తోటి మిత్రులు, అయ్యో పాపం అంటూ బంధువులు విలపించిన తీరు అందరిని కలచివేసింది. పొట్ట కూటి కోసం వెళ్లి,విగత జీవిగా మారి పుట్టెడు బాధను మిగిల్చిన మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మృతుడి బంధువులు , సన్నిహితులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *