JMS News Today

For Complete News

అది ప్రతి ఒక్కరి బాధ్యత….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

రామడుగు, జూన్ 5: ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుండి సర్పంచ్ గుండి మానస ప్రవీణ్ అన్నారు. ప్రపంచ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గుండి గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సన్ రైస్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణ పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేయాలని తద్వారా కాలుష్య రహిత గ్రామ పంచాయతీగా రూపుదిద్దుటకు యువత మహిళలు ముందుకు రావాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల నుండి తమకు తాము రక్షించుకోవాలని కోరారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత అల్వాల విష్ణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు యువత కృషి చేయాలని భావితరాల కోసం మంచి ప్రకృతిని వాతావరణాన్ని అందించే బాధ్యతను ప్రతి యువత తీసుకోవాలని కోరారు. గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి విరివిగా మొక్కలు నాటే విధంగా యువజన సంఘాలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండి ఉపసర్పంచి మేడి శ్రీనివాస్ గౌడ్ , సన్ రైస్ యూత్ క్లబ్ అద్యక్షులు శ్రీరామోజు సాయి కుమార్, యూత్ సభ్యులు రఘు, శ్రీకాంత్, కమల్, రాకేష్, అజయ్, యువజన నాయకులు కొలిపాక నాగరాజు, గుమ్మడి ప్రశాంత్, వార్డు మెంబర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *