JMS News Today

For Complete News

గుట్కాపై పోలీసుల గురి: ముగ్గురు అరెస్ట్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 26: కరీంనగర్ నగరంలో గత కొద్ది నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా  కొనసాగుతున్న గుట్కా దందాపై టాస్క్ ఫోర్స్ , త్రీ టౌన్ పోలీసులు నిఘా వేసి, గుట్కా సప్ప్లై చేస్తున్న ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి సుమారుగా ఒక లక్ష రూపాల విలువ గల గుట్కాను స్వాదీనం చేసుకొని, త్రీ టౌన్ పోలీసులకు అప్పగించగా, కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే….గత కొద్ది రోజులుగా కరీంనగర్ నగరంలో  గుట్టుచప్పుడు కాకుండా గుట్కా సరఫరా చేస్తున్నారని, వారు మారుతి నగర్ లో కిరాణం షాప్ లో వేయటానికి ఆటో లో నిషేధిత గుట్కా ను వేసుకొని త్రీ టౌన్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారన్న పక్క సమాచారం తో త్రీ టౌన్ ప్రాంతంలో వాహనాల తనిఖీ లో టాస్క్ఫ్ ఫోర్స్, త్రీ టౌన్ పోలీసులతో కలిసి గుట్కా గలా ఆటోను పట్టుకొని అనుమానంతో పరిశీలించగా, అందులో గుట్కా ను గుర్తించి, దానిని స్వాధీనం చేసుకొని ఇతనికి గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది,ఎలా వచ్చింది అనే దానిపై విచారణ జరుగుతుంది. వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వీరి 3 గురి దగ్గర నుంచి దాదాపు ఒక లక్ష రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని,3 గురుని త్రీ టౌన్ పోలీసులకి అప్పగించగా, కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వారిలో మంచిర్యాలకు చెందిన అరుణ్, గొండ శ్రవణ్, సుధాకర్ లు ఉన్నారు. వీరి నుంచి ఒక ఆటో, లక్ష రూపాయల నిషేధిత గుట్కా, మూడు చరవానిలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డిి మాట్లాడుతూ అక్రమంగా నిషేధిత గుట్కా ఉత్పత్తులను అమ్మినా, సరఫరా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలుమార్లు పట్టు బడిన వారి పైన పీడీ యాక్టు నమోదు చేయడం జరుగుతున్నదని తెెెలిపారు. ఈ దాడుల్లో ఏసీపీ శోభన్ కుమార్, సిఐ లు శ్రీనివాసరావు, కె. జనార్ధన్ రెడ్డి, విజయ్ కుమార్ లతో పాటు పలువురు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *