వెదిరలో చేనేత దినోత్సవ వేడుకలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, ఆగస్టు 7: రామడుగు మండలం వెదిర గ్రామంలో చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చేనేత కార్మికులు లక్ష్మీపతి తో పాటు పలువురు చేనేత కార్మికులకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కొలిపాక కమలాకర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత అల్వాల విష్ణు, బుధవారపు కార్తీక్, వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్ గౌడ్, వెదిర పద్మశాలి సంఘం నాయకులు లక్ష్మీపతి, సత్యనారాయణ, రమేష్ పాటు పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు.