JMS News Today

For Complete News

మంత్రి హామీ ఇవ్వడం పట్ల హర్షం….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 11: చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను బుధవారం కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ స్పందిస్తూ మీ సంఘానికి చూపించిన భూమిలో అభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అడగకుండానే ఆయనే స్పందించి హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ..మంత్రి కమలాకర్ కు సంఘం బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు జానంపేట మారుతీ, జగన్నాధం శ్రీనివాస్, చెన్నోజ్వల మనోహర స్వామి, తిరునగరి వెంకటేశ్వర స్వామి, తాడూరి కరుణాకర్, సింహాచలం యతీందర్, తిరునగరి ఆంజనేయ స్వామి, జానంపేట శ్రీనివాస్, ధర్మపురి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *