JMS News Today

For Complete News

మంత్రి చర్చలు సఫలం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 20: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. అనంతరం తక్షణమే రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు పునః ప్రారంభిస్తున్నట్లు ఇరువర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్యశ్రీ పథకం వెయ్యి రెట్లు మెరుగైనదని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 25 లక్షల కుటుంబాలకు మాత్రమే వైద్యం అందించే ప్రణాళిక చేస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 84 లక్షల కుటుంబాలు వైద్య సేవలను పొందుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 1లక్ష కుటుంబాలు ఉంటే 84 లక్షల కుటుంబాలకు ఆరోగ్యం అందించడం తెలంగాణ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న శ్రద్ధ కు నిదర్శనమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *