కరోన వైరస్ పై ఆందోళన వద్దు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జనవరి 28: కరోన వైరస్ తెలంగాణ లో ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తుందని, బుధవారం కరోన వైరస్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుందని తెలిపారు. బుధవారం దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని, ప్రజలు భయపడవద్దని మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు.