JMS News Today

For Complete News

వాటిపై పర్యవేక్షణ ఉండాల్సిందే…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 13: ప్రైవేటు ఆస్పత్రుల దోపిడిపై నిఘా పెట్టాలని, అనవసర టెస్టుల పేరుతో చేసే భయాందోళనలు లేకుండా చూడాలని, ప్రతిరోజు వాటిపై పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైద్య అధికారులకు సూచించారు. పత్రికల్లో వార్తలు వస్తే మాకేంటన్నట్లుగా ఉండవద్దంటూ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లా ఆసుపత్రితో పాటు, పీహెచ్సీలలో డాక్టర్లు లేరనే మాట వినిపించవద్దని తెలిపారు. పీహెచ్సీలు పూర్తి స్థాయిలో పనిచేస్తే జిల్లా ఆస్పత్రులపై భారం ఉండదని, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు ఏరియా సందర్శన తప్పకుండా చేయాలని సూచించారు. పీహెచ్సీ పరిధిలో తప్పకుండా హెల్త్ క్యాంపులు పెట్టాలని, మందుల కొరత, సెలైన్ల కొరత లేదని, బెడ్లు సరిపోకపోతే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఒకప్పుడు ఉన్నంత డెంగీ జ్వరాల తీవ్రత ఇప్పుడు జిల్లాలో లేదని తెలిపారు. ఇళ్లపై ఉండే నీళ్ల ట్యాంకులు ప్రజలు రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలని, అన్ని రకాల ఆస్పత్రులకు వచ్చే ఓపీ, ఐపీ సమాచారం తెప్పించుకోవాలని,  మలేరియా, డెంగీ కేసులను గుర్తించి వెంట వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. డెంగీ, వైరల్ ఫీవర్స్ నిర్ధారణ ప్రభుత్వ వైద్య శాఖ మాత్రమే నిర్థారించాలని, ప్రైవేటు ఆస్పత్రులిచ్చేవి ప్రామాణికం కాదని తెలిపారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజలను పరిశుభ్రత పట్ల ఎడ్యుకేట్ చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిధుల కొరత ఉంటే కలెక్టర్ దృష్టికి తేవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, కరీంనగర్ ఎంసీహెచ్ లో రద్దీ పెరిగిన తరుణంలో మరో ఫ్లోర్ వేస్తున్నామని చెప్పారు. సరైన కో ఆర్డినేషన్ లేక రోగులు ఇబ్బందుల పడుతున్నారని, అలా జరగకుండా చూడాలని చెప్పారు. డాక్టర్లకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నామని, అవసరమైతే తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి భాలకిషన్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, సుడా చైర్మన్ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *