ఆ గాలి వార్తలపై స్పందించవద్దు…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు, త్వరలో మంత్రి పదవి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి రాజేందర్ స్పందించారు. కొన్ని పత్రికలలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలతో గాలి వార్త లు వస్తున్నాయని, వాటిపై ఎవరూ స్పందించవద్దని మంత్రి రాజేందర్ ట్విట్టర్లో కోరారు. సోషల్ మీడియా లో కూడా పోస్టులు చేయవద్దని పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు మంత్రి సూచించారు.