JMS News Today

For Complete News

టీఆర్ఎస్ సర్కార్ కు చుక్కెదురు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే మరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *