కలర్ పుల్ గా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 18: కలర్ పుల్ గా హోళీ వేడుకలు సాగాయి. కరోనాతో రెండేళ్లుగా దూరంగా ఉన్న ప్రజలు కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో హోళీ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కరీంనగర్ నగరంలో హోలీ వేడుకలు జోరుగా సాగాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ..డ్యాన్సులు వేస్తూ హోలీ పండుగ చేసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ హోళీ వేడుకల్లో పాల్గొని, నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపారు. అటు కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, హోలీ సందర్భంగా పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. మొత్తానికి కరోనాతో రెండేళ్లు దూరంగా ఉన్న ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో హోళీ సంబరాల్లో పాల్గొన్నారు.